నాని కథానాయకుడిగా `జెర్సీ` అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే ఇది కూడా ఓ బయోపిక్ అని తెలుస్తోంది. రమణలాంబా అనే ఓ క్రికెటర్ ఉండేవాడు. 1986 నుంచి 1989 వరకూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 4 టెస్టులు, 32 వన్డే మ్యాచ్లు ఆడాడు.
క్రికెట్ ఆడుతూ బంతి బలంగా తలకు తాకడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. మూడేళ్ల తరవాత కోమాలోనే మరణించాడు. ఇప్పుడు నాని ఆ పాత్రనే పోషిస్తున్నాడని సమాచారం. అంటే... `జెర్సీ` కూడా ఓ బయోపిక్ అన్నమాట. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం దాచి ఉంచింది.
రమణలాంబ లా కెరీర్లో ఆటుపోట్లు ఎదుర్కున్న ఓ క్రికెటర్ తన అంతిమ క్షణాల్ని ఎలా అనుభవించాడో ఈ సినిమాలో చూపిస్తున్నారు. అంటే.. ఈ సినిమా విషాదంతో ముగుస్తుందన్నమాట. ఇప్పటి వరకూ నాని అంటే ఎంటర్టైన్మెంట్ పంచే పాత్రలే చేశాడు. ఇంత బరువైన పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.