లక్ష్మీస్ ఎన్టీఆర్తో వర్మ నందమూరి కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఈ సినిమాని ఆపేయాలని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ టీజర్లు, ట్రైలర్లు, పాటలు, తన కామెంట్లతో... నందమూరి వంశాన్నీ, టీడీపీ పార్టీనీ దడదడలాడిస్తున్నాడు వర్మ. తాజాగా బాలకృష్ణకు మరో షాక్ ఇచ్చాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణకు అంకితం చేస్తున్నా' అంటూ ప్రకటించాడు. టీడీపీకి పక్కలో బల్లెంలాంటి సినిమాని బాలయ్యకు బహుమతికిగా ఇవ్వడం.. వర్మలాంటివాళ్లకే సాధ్యం.
ఎన్టీఆర్ బయోపిక్ కోసం వర్మ పేరు పరిశీలించారు. రామ్గోపాల్ వర్మతో కొన్ని మీటింగులు కూడా జరిగాయి. మధ్యలో ఏమైందో.. వర్మని పక్కన పెట్టాశారు. ఆ కోపంతోనే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నాడని ప్రచారం జరిగింది. తాజా మాటలో అది కాస్త రూఢీ అయిపోయింది. 'నేను గనుక..బాలయ్యని కలవకపోతే... ఈ సినిమా తీసేవాడ్ని కాదు. అందుకే ఆయనకు అంకితం చేస్తున్నా' అంటూ వర్మ చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఇదే కావొచ్చు.