న‌రేష్ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన శివాజీ రాజా

By Gowthami - March 08, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

'మేమంతా స‌మాన‌మే' అని చెప్తుంటారు గానీ.. సినిమా వాళ్ల మ‌ధ్య 'ఈగో'ల గోల‌లెక్కువ‌గానే కనిపిస్తుంటాయి. అవి అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు, అవ‌కాశం చిక్కిన‌ప్పుడో బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. తాజాగా 'మా' ఎలక్షన్స్ సంద‌ర్భంగా సినీ రాజ‌కీయం వేడెక్కింది. `మా` ఎన్నిక‌ల‌లో పోటీకి దిగుతున్న రెండు ప‌క్షాలూ ఒక‌రిపై ఒక‌రు బుర‌ద చ‌ల్లుకునే ప‌నిలో బిజీగా ఉన్నాయి. అటు శివాజీ రాజా - ఇటు న‌రేష్‌.. ఈసారి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా న‌రేష్ నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాడు శివాజీ రాజా.

 

శివాజీరాజా 'మా' అధ్య‌క్షుడు అయ్యాక ఓ కొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టాడు. 'మా' స‌భ్యులు పుట్టిన రోజు జ‌రుపుకుంటే, వాళ్ల ఇంటికి వెళ్లి స్వీటు బాక్సు ఇచ్చి, శాలువాతో స‌త్క‌రించి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఆన‌వాయితీగా మారింది. అయితే ఇటీవ‌ల శివాజీ రాజా పుట్టిన రోజు వ‌చ్చింది. ఆ రోజున 'ఫిల్మ్ ఛాంబ‌ర్‌కి రా.. నిన్ను క‌ల‌వాలి' అంటూ న‌రేష్ శివాజీరాజాకు క‌బురు పెట్టాడ‌ట‌. న‌రేష్ కోసం శివాజీరాజా ఛాంబ‌ర్‌కి వ‌చ్చాడ‌ట‌. చాలా సేపు ఎదురుచూసినా న‌రేష్ రాలేద‌ట‌. 

 

'చూశావా.. పుట్టిన రోజున నా కోసం శివాజీ రాజాని ఎదురు చూసేలా చేశా' అంటూ మ‌రెవ‌రికో కాల్ చేసి న‌రేష్ వెట‌కారం చేసిన‌ట్టు శివాజీరాజా చెప్పుకొచ్చాడు. తెల్ల‌ని వ‌స్త్రంలా తాను స్వ‌చ్ఛ‌మైన‌వాడిన‌ని, త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అవ‌మానిస్తున్నార‌ని, ఇవ‌న్నీ భ‌రించ‌లేక ఈ ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకుందామని చూశాన‌ని, కానీ శ్రీ‌కాంత్ లాంటి మిత్రులు బ‌ల‌వంతం చేయ‌డం వ‌ల్లే పోటీకి దిగుతున్నాన‌ని క‌న్నీటి ప‌ర్యంతం అవుతూ చెప్పుకొచ్చాడు శివాజీ రాజా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS