ఇలా మొద‌లైంది.... అలా అయిపోయింది

మరిన్ని వార్తలు

కొన్ని కాంబినేష‌న్లు అంతే. హాట్ హాట్ కేకులుగా ఊరిస్తుంటాయి. సినిమా అలా మొద‌లైతే, ఇలా వ్యాపారం జ‌రిగిపోతుంటుంది. ప్ర‌స్తుతం యంగ్ హీరో నాని - విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌కీ అంత క్రేజ్ వ‌చ్చేసింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా మొదలైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'గ్యాంగ్ లీడ‌ర్‌' అనే పేరు కూడా పెట్టారు. ఓ ఆస‌క్తిక‌ర‌మైన టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. 

 

దాంతో ఈసినిమాపై అంచానాలు ఆకాశానికి తాకేశాయి. తొలి షెడ్యూల్ జ‌రుగుతుండ‌గానే ఓవ‌ర్సీస్ బిజినెస్ పూర్త‌యిపోయింది. ఈ చిత్రాన్ని రూ.5 కోట్ల‌కు స‌రిగ‌మ సంస్థ కొనుగోలు చేసింది. విక్ర‌మ్ కె.కుమార్ చిత్రాల‌కు క్లాస్ ఆడియ‌న్స్‌లో మంచి గిరాకీ ఉంటుంది. 

 

నాని సినిమా హిట్ట‌యితే గ‌నుక‌.. ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు సాధించ‌డం య‌మ తేలిక‌. పైగా ఈ సినిమా ద‌స‌రా సీజ‌న్‌లో విడుద‌ల కానుంది. అందుకే.. ఓవ‌ర్సీస్‌లో ఇంత మంచి రేటు ద‌క్కింది.  నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన జెర్సీ సినిమాకీ ఓవ‌ర్సీస్ డీల్ పూర్త‌య్యింది. ఈ చిత్రానికి 4.5 కోట్లు ల‌భిస్తే... గ్యాంగ్ లీడ‌ర్ మ‌రో అర‌కోటి ఎక్కువ చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS