కనబడకుండా 'మాయ' చేస్తానంటోన్న నాని

By iQlikMovies - June 30, 2018 - 15:58 PM IST

మరిన్ని వార్తలు

సీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తనయుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఈ మాయ పేరేమిటో'. 

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. కాగా ఈ సినిమాకి నేచురల్‌ స్టార్‌ నాని వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ హీరో రాహుల్‌ విజయ్‌, నానితో దిగిన ఫోటో పోస్ట్‌ చేశాడు. ఇటీవల నాని తన సొంత నిర్మాణంలో రూపొందిన 'అ' చిత్రంలో ఓ చేప పాత్రకు తన వాయిస్‌ అందించాడు. గతంలోనూ పలు చిత్రాలకు తన వాయిస్‌ అందించాడు నాని. ఈ సారి నాని వాయిస్‌ ఓవర్‌లో వస్తున్న 'ఈ మాయ పేరేమిటో' చిత్రం డెబ్యూ హీరో రాహుల్‌కి మంచి పేరు తీసుకొస్తుందేమో చూడాలి మరి.  

రాము కొప్పుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై దివ్య విజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్టుగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు నాని వాయిస్‌ ఓవర్‌ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కానుంది. 

ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS