వెంకీ సినిమాలో నారా రోహిత్‌?

మరిన్ని వార్తలు

వెంకీ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో విలన్‌గా నారా రోహిత్‌ని తేజ పరిశీలిస్తున్నట్లుగా సమాచారమ్‌. ఇప్పుడు హీరోగా కొనసాగుతున్న హ్యాండ్‌సమ్‌ గోపీచంద్‌ని 'నిజం' సినిమాలో విలన్‌గా మార్చింది తేజనే. అలాగే ఇప్పుడు నారా రోహిత్‌ని కూడా ఓ పవర్‌ ఫుల్‌ విలన్‌గా చూపించబోతున్నాడనీ ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. అయితే నారా రోహిత్‌ 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాడు. సో విలన్‌ పాత్ర నారా రోహిత్‌కి కొత్తేమీ కాకపోయినా, తేజ సినిమాలో విలన్‌ అంటే సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్‌ రోల్స్‌లో నటించడానికి నారా రోహిత్‌ ఎప్పుడూ ముందుంటాడు. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్‌ డిక్లరేషన్‌ రాలేదు. కానీ రోహిత్‌ విలన్‌ అయితే ఆ పాత్రకి వెయిట్‌ బాగా పెరుగుతుందనడం నిస్సందేహం. కాగా వెంకీ విషయానికి వస్తే, సెలెక్టివ్‌గా మూవీస్‌ చేసుకుంటూ పోతున్నాడు. 'గురు' సినిమాతో హిట్‌ అందుకున్నాడు. ఆ సినిమాలో నార్మల్‌గా వెంకీ కనిపించే పాత్రలకి భిన్నంగా నటించి, మెప్పించాడు. అలాగే ఇప్పుడు తేజ డైరెక్షన్‌లో ఏ గెటప్‌లో వెంకీ రానున్నాడో చూడాలి. ఇటీవలే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రానా వంటి హీరోతో ఆ సినిమాని బాగా డీల్‌ చేశాడు తేజ. మరో పక్క బాలయ్యతో 'ఎన్టీఆర్‌' చిత్రం తెరకెక్కించనున్నాడు. చిన్న ఆర్టిస్టులతో సినిమాలు తీసే తేజ, ఇప్పుడు స్టార్‌ హీరోలతో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS