విలక్షణ నటుడు నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం 'వీర భోగ వసంతరాయలు'. ఇంద్రసేన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో నారా రోహిత్ గెడ్డంతో, చేతికి కట్టుతో కోపంగా కనిపిస్తున్నాడు. 'హిట్‌మ్యాన్' అనే టైటిల్‌తో ఈ పోస్టర్‌ని విడుదల చేశారు. అంటే సినిమాలో నారా రోహిత్ స్వభావం పోస్టర్‌లో టైటిల్‌కి తగ్గట్లుగా ఉండబోతోందన్న మాట.
ఇకపోతే, ఎప్పుడూ ప్రయోగాలు చేసే నారా రోహిత్ ఈ సినిమాలో హ్యాండికేప్‌డ్‌గా నటిస్తున్నాడంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని ఈ ఫస్ట్‌లుక్ ద్వారా తేలిపోయింది. అయితే పోస్టర్‌లో నారా రోహిత్ కుడి చేతికి కట్టు వేసి ఉంది. అంటే సినిమా అంతా ఇలాగే కనిపిస్తాడా? లేక ఏదైనా రీజన్ పరంగా ఆయన చేతికి ఆ కట్టు ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నారా రోహిత్‌తో పాటు , శ్రీవిష్ణు, సుధీర్‌బాబు, అందాల భామ శ్రియ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
మొన్న శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. శ్రియ ఈ సినిమాలో ఎయిర్ హోస్టెస్‌గా నటిస్తోంది. ఇక శ్రీవిష్ణు, సుధీర్ బాబు పాత్రలు ఎలా ఉండబోతున్నాయో త్వరలోనే తెలియనుంది. 'వీర భోగవసంతరాయలు' సినిమా మొత్తానికి ఓ కాన్సెప్ట్ బేసెడ్ మూవీగా చెప్పొచ్చు.