కమర్షియల్ అంశాల్ని పక్కన పెట్టి, మొదట్నుంచీ విలక్షణ చిత్రాలను ఎంచుకుంటూ, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. కథకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే నారా రోహిత్ ఇప్పుడు కొంచెం ట్రాక్ ఛేంజ్ చేసి, కథతో పాటు కమర్షియల్ టచ్ కూడా ఇస్తానంటున్నాడు. నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బాలకృష్ణుడు'. రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతవరకూ నారా రోహిత్ చేసిన చిత్రాలన్నింటికీ 'బాలకృష్ణుడు' భిన్నంగా ఉండబోతోంది.
ఈ సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం ఆయనలో వచ్చిన తొలి మార్పుగా చెప్పుకోవచ్చు. హీరోయిన్ రెజీనా దాడిని తట్టుకోవడం ఈ సినిమాలో కొంచెం కష్టంగానే ఉండేలా ఉంది. ట్రైలర్‌లోనే అమ్మడు ఓ రేంజ్‌లో అందాలారబోసేసింది. సినిమా అంతా ఫుల్ గ్లామర్ ఒలకబోసేసిందనీ సమాచారమ్. ఇక రోహిత్ - రెజీనా కెమిస్ట్రీ అయితే చూడముచ్చటగా ఉండనుందట. మణిశర్మ అందించిన పాటలు ఈ సినిమాకి మంచి మెలోడిని పంచాయి. మెలోడి సాంగ్స్‌కి, రోహిత్, రెజీనా రొమాన్స్ తోడై సినిమా ఓ క్యూట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారమ్.
ఈ నెల 24న 'బాలకృష్ణుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. నారా రోహిత్ కెరీర్‌లో చాలానే డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి. వాటన్నింట్లోనూ ఈ సినిమా సరికొత్త గుర్తింపు తెచ్చుకోబోతోందనీ తెలుస్తోంది. జయసుధ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఆమె తన సహజ నటనతో ఆ పాత్రకి మరింత వన్నె తెచ్చారట. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చిత్రీకరించారు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.