లేటెస్ట్‌గా ధియేటర్స్‌లో ఎంట్రీ ఇచ్చిన 'జెర్సీ' సినిమాకి పోజిటివ్ టాక్ వస్తోంది. అన్ని వైపుల నుండీ సినిమాకి పోజిటివ్ రిపోర్ట్‌లే అందుతున్నాయి. ఇంతవరకూ నేచురల్ స్టార్ నాని అంటే ఏంటో చూసేశాం. కానీ 'జెర్సీ' సినిమాలో నాని ఓ కొత్త నటుడు. తనలో దాగున్న సరికొత్త నటున్ని బయటికి తీశాడు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే నాని సినిమాల్లో 'జెర్సీ' ఓ డిఫరెంట్ మూవీగా ఉండిపోతుందనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. అంత చక్కగా నాని తన నటనతో ఆకట్టుకున్నాడు ఈ సినిమాతో.
నాని వన్ మేన్ షో అంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల కథా, కథనాలకు ఒక్కో సందర్భంలో అర్ధమే లేకుండా పోతోంది. కానీ డైరెక్టర్ తాను అనుకున్న సబ్జెక్ట్‌ని అనుకున్న విధంగా సహజంగా మలిచడంలో సక్సెస్ అయ్యాడీ సినిమాతో. కంటెన్ట్ ఉంటే, కటౌట్‌తో పని లేదని చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. అలాంటిది నాని లాంటి కటౌట్‌కి కరెక్ట్ కంటెన్ట్ పడితే అది 'జెర్సీ'లానే ఉంటుందని ఈ సినిమా నిరూపించింది.
'కృష్ణార్జున యుద్ధం' నానిని నిరాశపరిచినా, 'జెర్సీ' సక్సెస్ ఇచ్చింది. నిజానికి నాని ఈ సినిమాని ఒప్పుకున్నప్పుడే సక్సెస్, ఫెయిల్యూర్‌ని అస్సలు దృష్టిలో పెట్టుకోలేదట. ఓ మంచి కథని ప్రేక్షకులకు చూపించాలనే కసితోనే ఈ సినిమా ఒప్పుకున్నాడట. నిజంగానే ప్రేక్షకులు మెచ్చిన కథగా 'జెర్సీ' ప్రశంసలు అందుకుంటోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'జెర్సీ'లో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాధ్ నటించింది.