ఎట్టకేలకు 'చిత్రలహరి' సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. పేరు మార్చుకుంటే తప్ప లక్కు కలిసిరాలేదేమో ఈ మెగా మేనల్లుడికి. సాయి ధరమ్ తేజ్ కాస్తా 'చిత్రలహరి' కోసం సాయి తేజ్‌గా మారిన విషయం విదితమే. ఇది కేవలం ఈ సినిమాకి మాత్రమే పరిమితమని గతంలో సాయి ధరమ్ తేజ్ చెప్పినా, ఇకపై సినిమాలకి కూడా 'సాయి తేజ్'గానే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చాడట. అదీ మేనమామ పవన్‌కళ్యాణ్ సూచనలతోనేనని సమాచారమ్.
ఇదిలా వుంటే, తన తదుపరి సినిమాని మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడు ఈ సుప్రీం హీరో. మారుతి సినిమాల్లో ఫన్ చాలా ఎక్కువగా వుంటుంది. ఆ కామెడీ టైమింగ్ సాయి తేజ్‌లో చాలానే వుంది. పైగా, 'చిత్రలహరి' సినిమాతో నటుడిగా ఓ మెట్టు పైకెక్కాశాడు కూడా. దాంతో, మారుతి సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కి టైలర్ మేడ్ క్యారెక్టర్ దొరికినట్లేనని భావించొచ్చు.
ఇదిలా వుంటే, మారుతి తొలుత చిరంజీవి సినిమాల్లోంచి ఓ సూపర్ హిట్ సాంగ్‌ని రీమిక్స్ చేయాలని అనుకున్నా, ఆ నిర్ణయం నుంచి ఇప్పుడు పక్కకు తప్పుకున్నాడట. కొన్నాళ్ళపాటు భిన్నమైన ఆలోచనలతోనే ముందడుగు వేయాలన్నది సాయితేజ్ ఆలోచనలా కన్పిస్తోంది. ఆ నిర్ణయానికి కట్టుబడి మంచి కథల్ని సాయి తేజ్ ఎంచుకోగలిగితే, హీరోగా తనదన ముద్ర వేయగలుగుతాడు తెలుగు తెరపై.