వెబ్ సిరీస్‌ల‌పై నాని దృష్టి

By Gowthami - April 17, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

ఇది వెబ్ సిరీస్ ల కాలం. సినిమాకి ఏమాత్రం తీసిపోని స్టాండ‌ర్డ్స్ లో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు కూడా ఈ రంగంపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా వెబ్ సిరీస్‌ల‌పై ఫోక‌స్ చేస్తున్నాడు. నానిలోనూ ఓ నిర్మాత ఉన్న సంగ‌తి తెలిసిందే. వాల్ పోస్ట‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమాలు తీస్తున్నాడు. త్వ‌ర‌లో నాని నుంచి ఓ వెబ్ సిరీస్ వ‌చ్చే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

 

ఇదే విష‌యంపై నాని మాట్లాడుతూ ''వెబ్ సిరీస్‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. రానున్న రోజుల‌న్నీ వెబ్ సిరీస్‌ల‌వే. ఎలాగూ చేతిలో ఓ బ్యాన‌ర్ ఉంది. అందుకే సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లూ రూపొందించాల‌న్న ఆస‌క్తి క‌లుగుతోంది. మంచి కాన్సెప్ట్ దొరికితే ఓ వెబ్ సిరీస్ చేస్తా'' అంటున్నాడు. 

 

అంతేకాదు.. నాని నిర్మాత‌గా త్వ‌ర‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. నాని కేవ‌లం నిర్మాత పాత్ర‌కే ప‌రిమితం అవుతాడు. యాక్ష‌న్ ఇమేజ్ ఉన్న ఓ అగ్ర హీరో క‌నిపిస్తార‌ని స‌మాచారం అందుతోంది. అన్న‌ట్టు నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన 'జెర్సీ' ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS