ఇంద్రగంటితో 'వ్యూహం' పన్నుతోన్న నాని.!

By Inkmantra - March 30, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నానిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ. డైరెక్షన్‌ ఫీల్డ్‌లో పని చేసిన అనుభవం ఉన్న నానిలోని నటున్ని గుర్తించిన మొదటి డైరెక్టర్‌ ఇంద్రగంటి. అందుకే నటన పరంగా ఆయన తనకు గురువు అని పలుమార్లు నాని చెబుతుంటాడు. ఇంద్రగంటితో నాని చేసిన తొలి సినిమా 'అష్టా చెమ్మా' మంచి హిట్‌ అందుకుంది. తర్వాత 'జెంటిల్‌మెన్‌' కూడా హిట్‌ లిస్టులోకే చేరింది. 

 

తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఆ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. మామూలుగానే ఇంద్రగంటి సినిమాలు సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ లేటెస్ట్ చిత్రం కూడా అలాంటిదే అంటున్నారు. విభిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందనీ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నానితో పాటు, సుధీర్‌ వర్మ కూడా నటిస్తున్నాడు. అంటే ఇదో మినీ మల్టీ స్టారర్‌ మూవీగా అభివర్ణించాలి. 

 

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నాని విలన్‌గా కనిపించబోతున్నాడనీ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నాని విలన్‌ కాదనీ, పాత్రలో అక్కడక్కడా నెగిటివ్‌ ఛాయలు కనిపిస్తాయంతే. పూర్తి స్థాయి విలన్‌ పాత్ర కాదనీ తెలుస్తోంది. నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు విక్రమ్‌ కుమార్‌తో నాని మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS