పొలిటీషియన్‌గా మారనున్న నయనతార.?

మరిన్ని వార్తలు

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సినీ గ్లామర్‌కి రాజకీయ పార్టీలు వల వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు, హీరోయిన్‌ నయనతారకి కూడా గాలమేస్తున్నాయట. ఆ విషయం పక్కన పెడితే, నయనతారతో ఓ పొలిటికల్‌ బేస్డ్‌ మూవీ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

 

ఓ లేడీ పొలిటీషియన్‌ సక్సెస్‌ స్టోరీని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఆ లేడీ పొలిటీషియన్‌ ఎవరు.? అన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. తమిళనాడు రాజకీయాల్లో లేడీ పొలిటీషియన్‌ అంటే అందరికీ గుర్తుకొచ్చేది జయలలితనే. అయితే, నయనతార చేయబోయే సినిమాకి జయలలితతో సంబంధం వుండకపోవచ్చన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. అయినాగానీ, పరోక్షంగా జయలలిత రిఫరెన్స్‌లు సినిమాలో వుంటాయని అంటున్నారు.

 

తమిళనాడు రాజకీయాల్ని, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్నీ మిక్స్‌ చేసి, సినిమా కథని రూపొందించాడట ఓ యువ దర్శకుడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో నిర్మించనుందట. ఈ సినిమా కోసం నయనతారకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే నయనతార హయ్యస్ట్‌ పెయిడ్‌ యాక్ట్రెస్‌. ఈ విషయం అందరికీ తెల్సిందే. ఆమెతో సినిమాలు చేస్తే వస్తే ప్రాఫిట్స్‌ ఆ రేంజ్‌లో వుంటాయి మరి. టాలీవుడ్‌కి చెందిన ఓ యువ హీరో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాడట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS