టాలీవుడ్లో బౌన్స్ బ్యాక్ అవడానికి రకుల్ ప్రీత్‌సింగ్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న తరుణంలో రకుల్ చూపించిన స్పీడు అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలేద్దామని భావించిన తరుణంలో బాలీవుడ్ అవకాశం రావడం, అటు వైపు తొంగి చూసిన రకుల్‌కి టాలీవుడ్ ప్రేక్షకులు గట్టి గుణపాఠం చెప్పేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రకుల్ నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా టైంలో రకుల్‌కి ఓవరాక్షన్ చాలా ఎక్కువైందంటూ విమర్శలు కూడా వినిపించాయి.
అయితే ఆ తర్వాత రకుల్ హవా టాలీవుడ్లో మెల్ల మెల్లగా తగ్గుతూ జీరోకి పడిపోయింది. ఎట్టకేలకు నాగార్జున సరసన 'మన్మధుడు 2'లో రకుల్ హీరోయిన్గా ఎంపికైంది. కానీ ఆ సినిమాపై అంచనాలు ప్రస్తుతానికైతే అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏం చేసినా నాగార్జునే చేయాలి. ఇదంతా బాగానే ఉంది. కానీ రీ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు టాలీవుడ్‌ని తెగ పొగిడేస్తోంది. టాలీవుడ్ హీరోలు చాలా మంచి వాళ్లు.. హీరోయిన్స్ పట్ల చాలా గౌరవంగా ఉంటారు.
మంచి డాన్సర్లు.. అంటూ తాను స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలపై ప్రశంసల జల్లు కురిపించేస్తోంది. అందితే జుట్టు. అందకపోతే కాళ్లూ అంటారు కదా. అది ఇదే కావచ్చు. క్రేజ్ ఉన్న టైంలో ఓ మాట. క్రేజ్ తగ్గాక ఇంకో మాట. ఏది ఏమైనా బిస్కెట్ల ఫ్యాక్టరీలకు ఆఫర్లు రాలతాయా.. చెప్పండి. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్లో 'దే దే ప్యార్ దే' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. ఆ ప్రమోషన్స్‌లో భాగంగానే వీలు చిక్కితే ఇలా టాలీవుడ్‌ని కూడా ఓ సారి గుర్తు చేసుకుంటోందన్న మాట.