పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ ఇంతక ముందు తాను కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'OG '. ఈ మూవీని సాహో ఫేమ్ సుజిత్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. పవన్ కూడా పలు సందర్భాల్లో OG చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు అని హైపు పెంచారు. OG గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. పవన్ కి జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇప్పటికే సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది అని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
ఇలాంటి టైంలో OG నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే OG లో పవన్ తో కలిసి రాధిక చిందేయనుంది అంట. రాధిక ఎవరు అనుకుంటున్నారా? అదే నండి DJ టిల్లు రాధిక. నేహా శెట్టి ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు DJ టిల్లుతో తెచ్చుకుంది. ఇప్పడు పవన్ తో OG లో ఓ ప్రత్యేక గీతం చేస్తోంది అన్న టాక్ తోనే పాపులారిటీ తెచ్చుకుంది. ప్రజంట్ థాయిలాండ్ లో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే రెండు రోజుల షెడ్యూల్ జరిగిందని తెలుస్తోంది. నేహా శెట్టి తన ఇన్ స్టాలో థాయ్లాండ్‌లో ఉన్నా, ఓ షూటింగ్ కోసం వచ్చా అంటూ హింట్ ఇచ్చింది. కానీ ఓజీ సంగతి బయట పెట్టలేదు.
OG మేకర్స్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ఇప్పటివరకు చిన్న హీరోల సినిమాల్లో నటించిన నేహా కిది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ చివరి సినిమాలు కావటంతో ప్రేక్షకులు కూడా ప్రతి అప్డేట్ ని హైపు కి తీసుకు వెళ్తున్నారు. దీనితో రాధిక క్రేజ్ కూడా పెరిగినట్టే. OG మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఐటెం గీతాన్నీ తమన్ మంచి రాప్ స్టైల్ లో కంపోజ్ చేసారని సమాచారం.