బాక్సాఫీసు దగ్గర 'ఎన్టీఆర్ మహానాయకుడు' నత్తనడక నడుస్తున్నాడు. దారుణమైన పరాజయం వైపు మాత్రం దూసుకుపోతున్నాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 1.6 కోట్లు సాధించింది. రెండోరోజు ఇందులో సగం కూడా రాలేదు. కేవలం రూ.47 లక్షల దగ్గర ఆగిపోయి బయ్యర్లనీ మరింత నిరాశలో మంచేసింది. తొలిరోజు థియేటర్లో జనం లేకపోవడం, రివ్యూలూ అంతంత మాత్రంగానే రావడంతో - జనాలు థియేటర్లకు రావడానికి బద్దకించారు. ఆ ప్రభావం వసూళ్లపై పడింది.
నైజాంలో 18 లక్షలు తెచ్చుకున్న మహానాయకుడు, గుంటూరులో 5 లక్షలతోనూ, నెల్లూరులో 2 లక్షలతోనూ సరిపెట్టుకున్నాడు. తూర్పు, పశ్చిమ గోదావరిల్లో ఎక్కడా 2 లక్షలకు మించి రాబట్టుకోలేదు. ఓవర్సీస్ లో వసూళ్లు మరింత దారుణంగా ఉన్నాయి. ఆదివారంతో ఈ సినిమా భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. డిస్టిబ్యూటర్లు ఏ మేరకు నష్టపోనున్నారు అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.