మహేష్‌బాబు తాజా చిత్రం 'మహర్షి' రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న అనుమానాల రీత్యా పలు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమాల్లో 'ఎఫ్ 2' తప్ప మిగిలిన సినిమాలన్నీ దాదాపు నిరాశనే మిగిల్చాయి. దాంతో త్వరలో రానున్న 'మహర్షి'పైనే టాలీవుడ్ ఆశలన్నీ. అయితే ఏప్రిల్‌లో విడుదల కావల్సిన 'మహర్షి' షూటింగ్ పనులు చాలా పెండింగ్ ఉన్నాయనీ, రీషూట్స్ నిర్వహిస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి చెక్ పెట్టాలంటే, 'మహర్షి' టీమ్ నుండి రిలీజ్ డేట్ విషయంలో పక్కా అనౌన్స్‌మెంట్ వచ్చి తీరాల్సిందే.
ఆ దిశగా 'మహర్షి' టీమ్ ఓ కొత్త ఆలోచన చేస్తోందట. త్వరలోనే 'మహర్షి' నుండి దిమ్మ తిరిగిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చి రిలీజ్ డేట్‌ని పక్కా చేయనుందట. అప్పుడెప్పుడో వచ్చిన మహేష్ ఫస్ట్‌లుక్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినా, జనం మర్చిపోయారు. అందుకే మళ్లీ రెండో టీజర్‌ని విడుదల చేయాలనుకుంటున్నారట. ఫస్ట్ టీజర్‌లో మహేష్‌ని కాలేజ్ స్టూడెంట్‌గా చూపించిన చిత్ర యూనిట్, ఈ టీజర్‌లో మహేష్ నెక్స్ట్ లెవల్ లుక్‌ని రివీల్ చేయనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
అలాగే ఈ టీజర్‌తో హీరోయిన్ పూజా హెగ్దే, అల్లరి నరేష్ పాత్రల్ని కూడా పరిచయం చేయనున్నారట. త్వరలోనే ఈ అప్‌డేట్‌ని ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్దం చేస్తోందట మహర్షి టీమ్. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. మహేష్‌బాబు 25వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.