కొత్తగా ముస్తాబవుతోన్న 'లవర్స్‌డే'.!

By Inkmantra - February 19, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

జస్ట్‌ టీజర్‌ ప్రోమోతో వరల్డ్‌ వైడ్‌గా పాపులర్‌ అయిపోయిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటించిన మలయాళీ చిత్రం 'ఒరు అదర్‌ లవ్‌'. ఒమర్‌ లులు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రియా ప్రకాష్‌కి దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌తో ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేశారు. వేలంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో 'లవర్స్‌డే' పేరుతో ఈ సినిమాని విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

 

అయితే ప్రోమోకి వచ్చిన రెస్పాన్స్‌ సినిమాతో అస్సలు మ్యాచ్‌ చేయలేకపోయింది ప్రియాప్రకాష్‌ వారియర్‌. కనీసం ఓపెనింగ్స్‌ కూడా దక్కించుకోలేకపోయింది ఈ సినిమా. తీరా ఒకటీ, అరా సినిమా చూసిన వాళ్లకీ తీవ్రమైన నిరాశే మిగిలింది. అందుకు కారణం ఈ సినిమా అనుకున్నప్పుడు కథ వేరు, ప్రియా క్రేజ్‌తో కథలో కీలక మార్పులు జరగడంతో సినిమాలో ఉండాల్సిన అసలు ఫీల్‌ మిస్సయ్యింది. సినిమాకి ఆయువు పట్టైన క్లైమాక్స్‌ పూర్తిగా డిజిప్పాయింట్‌ చేయడంతో సినిమాని చాలా త్వరగా అందరూ మర్చిపోయారు. 

 

దాంతో ఈ సినిమా దర్శక, నిర్మాతలు ఓ ఆశక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. క్లైమాక్స్‌లో మార్పులు చేసి మళ్లీ రీషూట్‌ చేశారు. రీషూట్‌ జరిగిన క్లైమాక్స్‌తో ఈ బుధవారం నుండి 'లవర్స్‌డే' ధియేటర్స్‌లో సందడి చేయనుందట. దాదాపు 10 నిముషాల కీలక సన్నివేశాన్ని మార్చి తెరకెక్కించారట. ప్రేక్షకులు శాటిస్‌ఫై అయ్యేలా ఈ క్లైమాక్స్‌ ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. అంతేకాదు, ఈ క్లైమాక్స్‌ మార్పుతో సినిమా రిజల్టే మారిపోతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి, ఈ మార్పులు, చేర్పులతో 'లవర్స్‌డే' పుంజుకుంటుందేమో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS