తమిళ అర్జున్‌రెడ్డికి డైరెక్టర్ దొరికేశాడు. సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. 'వర్మ' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఇంతకీ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా.? తెలుగులో 'అర్జున్‌రెడ్డి' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన గిరి సయ్య ఈ సినిమాతో డైరెక్టర్‌గా ప్రమోట్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే, బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ని అలాగే ఉంచేయాలని అనుకుంటున్నారట.
కొన్ని సీన్లు మాత్రమే మార్చి వాడుకుందామనుకుంటున్నారట. అయితే ఈ విషయమై పాత డైరెక్టర్ బాల, నటుడు విక్రమ్, ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయనీ కోలీవుడ్ వర్గాల సమాచారమ్. ఒకవేళ అదే జరిగితే సినిమా చిత్రీకరణకు కొంత టైం కలిసొచ్చే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరలో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట. హీరోయిన్గా బనితా సందుని ఎంపిక చేశారు.
బాలీవుడ్లో 'అక్టోబర్' అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. 'వర్మ'తో సౌత్‌లోకి అడుగుపెడుతోంది. 'అర్జున్‌రెడ్డి' సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. పర్ఫామెన్స్ పరంగా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రది. ఒరిజినల్లో నటించిన షాలినీ పాండేకి ఈ సినిమా తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అలాగే ఈ కొత్త భామ కూడా మంచి మార్కులేయించుకుంటే, సౌత్‌లో అవకాశాలకు తిరిగి చూసుకోనక్కర్లేదంతే.