కత్తి దూసిన కంగనా.!

By iQlikMovies - January 11, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనారనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'మణికర్ణిక' మూవీ ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. ఇటీవల వచ్చిన 'మణికర్ణిక' టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్‌ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నుండి తాజాగా సాంగ్‌ ప్రోమో వీడియోను విడుదల చేశారు. 'విజయీభవ..' అంటూ సాగే ఈ పాటలో కంగనా కత్తి తిప్పుడు అద్భుతంగా ఉంది. 

 

బ్రిటీష్‌ వారి ఎత్తులకు కంగనా పై ఎత్తులు వేయడం, సైన్యంలో ధైర్యం నింపే క్రమంలో వారికి కత్తి విద్యలో సూచనలివ్వడం తదితర అంశాలను చూపించారు. భారీ సెట్టింగుల్లో ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్‌గా కంగనా ఆహార్యం, రాజసం ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రసూన్‌ జోషి సాహిత్యం అందించిన ఈ పాటను శంకర్‌ మహాదేవన్‌ ఆలపించారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ సినిమాను జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

'మణికర్ణిక' సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు కాగా, కొన్ని కారణాల వల్ల సినిమాలో కొంత భాగానికి కంగనా రనౌత్‌ దర్శకత్వం వహించాల్సి వచ్చింది. అనేక వివాదాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆశక్తి కలిగిస్తున్నాయి. అయితే విజయం వరిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. ఒకవేళ విజయం వరించిందా.. 'క్వీన్‌' తర్వాత కంగనా పేరు బాలీవుడ్‌లో ఆ స్థాయిలో మార్మోగిపోతుందనడం అతిశయోక్తి కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS