సంక్రాంతి 'గ్లామర్‌' ఫైట్‌లో నెగ్గేదెవరు.?

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి హీరోలు బాలయ్య, రామ్‌చరణ్‌, వెంకీ, వరుణ్‌తేజ్‌లతో పాటు, వారి వారి పాట్నర్స్‌ అదేనండీ ముద్దుగుమ్మలు కూడా బరిలోకి దిగుతున్నారు. నువ్వా నేనా అనేలా గ్లామర్‌ షోకి సిద్ధమవుతున్నారు. వీరిలో విద్యాబాలన్‌ని సీనియర్స్‌ లిస్టులో వేయాలి. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో నటించిన విద్యాబాలన్‌ పాత్రలో ఎలాంటి గ్లామర్‌కీ చోటు లేదు. ఓన్లీ పర్‌ఫామెన్స్‌. ఆల్రెడీ తన పర్‌ఫామెన్స్‌తో మంచి మార్కులేయించేసుకుంది విద్యాబాలన్‌. ఇక ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించిన రకుల్‌ తదితరులు అంతగా హైలైట్‌ కాలేదు

నెక్స్ట్‌ వంతుగా తమన్నా, మెహ్రీన్‌, కైరా అద్వానీ బాక్సాఫీస్‌ వద్ద తలపడనున్నారు. 'ఎఫ్‌ 2'తో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రోమోస్‌లో వీరిద్దరూ చాలా హాట్‌గా కనిపిస్తున్నారు. ఏకంగా బికినీలతో మెరిపించేశారు. పర్‌ఫామెన్స్‌ పరంగానూ చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఇకపోతే 'వినయ విధేయ రామ'తో వస్తున్న కైరా అద్వానీ గ్లామర్‌లో ఎంత మాత్రమూ తక్కువ కాదు, ఎంతైనా బాలీవుడ్‌ బ్యూటీ కదా ఓ రెండాకులు ఎక్కువే చదివింది కానీ, తక్కువయితే కాదు.

అయితే ప్రోమోస్‌ పరంగా కైరా అద్వానీ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కానీ, తమన్నా, మెహ్రీన్‌లతో పోల్చితే ఈ సినిమాలో గ్లామర్‌ కాస్త తక్కువే ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. గ్లామర్‌ సంగతి పక్కన పెడితే, ఫన్‌ వైజ్‌గా కైరా సినిమాలో చరణ్‌ని మించిపోయి పర్‌ఫామ్‌ చేసిందట. సీత పాత్రలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తానని స్వయంగా కైరానే చెప్పింది. ఇదిలా ఉంటే, వీరి మధ్యలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'పేట' డబ్బింగ్‌ చిత్రం ద్వారా సీనియర్‌ భామలు త్రిష, సిమ్రాన్‌ కూడా పోటీ పడనున్నారు. అయితే వీరిద్దరి పాత్రల్లో గ్లామర్‌కి అస్సలు స్కోప్‌ ఉన్నట్లయితే కనిపించడం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS