ప్రభుదేవా డైరెక్షన్‌లో సాయిపల్లవి.!

By Inkmantra - April 19, 2019 - 13:25 PM IST

మరిన్ని వార్తలు

డాన్స్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవాకి డాన్స్‌ బేస్డ్‌ సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం. ఓ వైపు దర్శకుడిగా, ఇంకో వైపు నటుడిగా.. బిజీగా వున్న ప్రభుదేవా, త్వరలో మరో డాన్స్‌ బేస్డ్‌ మూవీ చేయాలనే ఆలోచనతో వున్నాడట. అయితే, ఈ సినిమా కోసం దర్శకుడిగా వేరే వ్యక్తిని అనుకుంటున్నాడట ప్రభుదేవా. ఇందుకోసం ఓ యువ దర్శకుడితో మంతనాలు జరుపుతున్న ప్రభుదేవా, త్వరలోనే ఆ సినిమా వివరాల్ని వెల్లడించనున్నాడని తెలుస్తోంది. 

 

కాగా, ప్రభుదేవా రూపొందించబోయే ఆ డాన్స్‌ బేస్డ్‌ ఫిలింలో సాయి పల్లవి నటించనుందనీ, ఆమె చుట్టూనే సినిమా కథ అంతా నడుస్తుందనీ సమాచారమ్‌. సాయి పల్లవి మంచి డాన్సర్‌. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. ప్రభుదేవాతో సినిమా అంటే సాయిపల్లవి 'నో' అనే అవకాశమే లేదు. అన్నట్టు, మరో డాన్సింగ్‌ బ్యూటీ సయ్యేషా సెహగల్‌ కూడా ఈ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. 

 

ఇటు సాయిపల్లవి, అటు సయ్యేషా.. ఇద్దరూ ప్రభుదేవా కొరియోగ్రఫీలో డాన్స్‌ చేసి, సత్తా చాటినోళ్ళే. పైగా, ఈ ఇద్దరి డాన్సులూ ప్రభుదేవాని ఎంతో మెప్పించాయి. ఆ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ప్రస్తుతం తన తాజా సినిమా 'అభినేత్రి-2' విడుదల పనుల్లో బిజీగా వున్న ప్రభుదేవా ఆ సినిమా విడుదల తర్వాతే సాయిపల్లవితో సినిమాపై ఓ ప్రకటన చేసే అవకాశం వుందని సమాచారమ్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS