నిధి అగర్వాల్ ఈ బ్యూటీకి సరైన సక్సెస్ అయితే రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్‌కి మాత్రం ఏం లోటు లేదు. అమ్మడు ఎంట్రీకి ముందే సోషల్ మీడియాని తన హాట్ పిక్స్‌తో హీటెక్కించేసింది. ఇప్పుడు వరుసగా 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలు కూడా అయిపోయింది.
ఇంకేముంది అమ్మడు ఏం చేసినా నెటిజన్స్‌కి ఇష్టమే. సోషల్ మీడియాలో నెటిజన్స్‌ని ఎట్రాక్ట్ చేయడానికి సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధమేముంది. ఎక్కడో చోట, ఏదో ఒక రకంగా ఇమేజ్‌ని మ్యానేజ్ చేయడమే కదా కావాల్సింది. అదే ఈ ముద్దుగుమ్మ చేస్తోంది.
తాజాగా నిధి అగర్వాల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోకి బోలెడన్ని క్లిక్కులు, లైకులూ వచ్చేస్తున్నాయి. అంతలా కిక్ ఇస్తోంది మరి ఈ పిక్. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఇస్మార్ట్ శంకర్'లో రామ్‌కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.