గ్లామ్‌షాట్‌: సూపుల్తో గుచ్చి గుచ్చి సంపకే..!

By iQlikMovies - January 08, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

గంపెడు ఆశతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. 'సవ్యసాచి' చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన నిధి అగర్వాల్‌ తొలి సినిమాతో ఫెయిల్యూర్‌ని చవి చూసింది. మలి సినిమా 'మిస్టర్‌ మజ్ను'తో రాబోతోంది. తెరంగేట్రానికి ముందే అమ్మడు సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయి ఫాలోయింగ్‌ పెంచేసుకుంది. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో, హాట్‌ గ్లామర్‌తో కుర్రోళ్లకు ముందే గాలమేసేసింది. అయితే సినిమా సక్సెస్‌ అయ్యి ఉంటే అమ్మడి దశ మరోలా ఉండేది. 

 

అయితే త్వరలోనే ఈ హాట్‌ బ్యూటీ 'మిస్టర్‌ మజ్ను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'సవ్యసాచి' సినిమాలో మాదిరి విడుదలకు ముందు అంచనాలు రేపడం లేదీ క్యూటీ. పోస్టర్స్‌లో డల్‌గా కనిపిస్తోంది. సినిమాలో ఎలా ఉంటుందో చూస్తే కానీ తెలీదు. ఇకపోతే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ని మాత్రం విడిచి పెట్టనేలేదు నిధి అగర్వాల్‌. తాజాగా ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. హస్కీ ఐస్‌తో న్యూడీ లిప్స్‌తో ఇన్నోసెంట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కుర్రోళ్ల గుండెల్ని మజాతో సన్నగా కోసేస్తున్నట్లున్నాయ్‌ ఆమె చూపులు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS