'ఆ' సినిమాలతో తమన్నాకి తనివి తీరడం లేదట!

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే ఒకప్పుడు కమర్షియల్‌ హీరోయిన్‌. కానీ, ఇప్పుడు హారర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయినట్లుంది. ఆమె నటించిన 'దేవి' సిరీస్‌ చిత్రాలు ఆమెని హారర్‌ హీరోయిన్‌గా మార్చేశాయి. అయితే, పూర్తిగా హారర్‌ చిత్రాలే చేస్తోందా.? తమన్నా అంటే, కాదనే చెప్పాలి. ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో బెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. త్వరలో 'సైరా' సినిమాతో రానుంది.

 

'క్వీన్‌' తెలుగు రీమేక్‌ 'దటీజ్‌ మహాలక్ష్మీ' ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్నా, ఎందుకో విడుదలకు నోచుకోవడం లేదు. ఇది కాక తమిళంలోనూ తమన్నా బిజీగానే ఉంది. అక్కడ విశాల్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. లేటెస్ట్‌గా హిందీలోనూ రెండు ప్రాజెక్టులు తమన్నా చేతికి చిక్కాయి. ఇక తాజాగా తమిళంలో ఇంకో సినిమాలోనూ తమన్నా నటిస్తోంది. ఇదో హారర్‌ థ్రిల్లర్‌ మూవీ అని తెలుస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని బట్టి, తమన్నా 'దేవి' సినిమాలో నటించిన 'రూబీ' పాత్రను పోలి ఉంది ఈ సినిమాలో తమన్నా పాత్ర. సో ఇది కూడా హారర్‌ మూవీనే అని అర్ధమవుతోంది.

 

యోగిబాబు తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోహిత్‌ వెంకేశన్‌ ఈ సినిమాకి దర్శకుడు. 'పెట్రోమాక్స్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారీ సినిమాకి. ఇటీవల ఓంకార్‌ దర్శకత్వంలో 'రాజుగారి గది 3' నుండి తమన్నా తప్పుకున్న సంగతి తెలిసిందే. స్క్రిప్టు విషయంలో బేధాభిప్రాయాలు రావడంతోనే తమన్నా ఆ స్క్రిప్టు నుండి తప్పుకుందనే టాక్‌ ఉంది. తెలుగులో భయపెడతానంటూ రాజుగారి మూడో గదికి వెళ్లిన తమన్నా, తానే భయపడి బయటికొచ్చేసింది. ఇప్పుడు తమిళంలో 'పెట్రోమాక్స్‌'తో మళ్లీ భయపెట్టేందుకు సిద్ధమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS