నిఖిల్ కిరాక్ పార్టీ చిత్రం ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదల అవ్వడం అందరిచేత సూపర్బ్ అనిపించుకోవడం కూడా జరిగిపోయాయి.
ఇక ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరిదశకు చేరుకున్నది, దీనితో ఈ చిత్రానికి సంబందించిన విడుదల తేదీ బయటకి వచ్చేసింది. అది ఎప్పుడంటే- ఫిబ్రవరి 9, 2018. దీనితో నిఖిల్ వచ్చే ఏడాది మొదట్లోనే బాక్స్ ఆఫీస్ ని ఎదురుకోనున్నాడు అనమాట.
ఇదిలావుండగా ఈ కిరాక్ పార్టీ తో సిమ్రాన్ అనే కొత్త హీరోయిన్ తెలుగు తెరకి పరిచయం అవుతుండడం అలాగే శరణ అనే కొత్త దర్శకుడు కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నాడు. అన్నిటికన్నా ఆసక్తికర అంశమేమిటంటే ప్రముఖ దర్శకులు- సుదీర్ వర్మ & చందు మొండేటిలు ఈ సినిమాకి మాటలు-కథనంలు అందించారు.
మరి ఇన్ని ప్లస్ అంశాలు ఉన్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభావం చూపనుందో అన్నది ఇంకొక రెండు నెలలు ఆగితే తేలిపోతుంది.