'బుజ్జిగాడు' తదితర చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ సంజన చెల్లెలు నిక్కీ గల్రాని, జోరుగా దూసుకెళ్లిపోతోంది. తెలుగులో స్ట్రెయిట్‌గా చేసింది ఒక్క సినిమానే అయినా కానీ అదరగొట్టేసింది. సునీల్ హీరోగా వచ్చిన 'కృష్ణాష్టమి' సినిమాలో నిక్కీ గల్రాని హీరోయిన్గా నటించింది. ఇది కాక 'మలుపు' సినిమాతోనూ ఆకట్టుకుంది. నటన పరంగా ఈమెకు ఫుల్ మార్కులే పడ్డాయి. అందంతో పాటు, అభినయం కూడా ఉంది. అలాగే మంచి డాన్సర్ కూడా. సో అనువాద చిత్రాలైనా కానీ అమ్మడికి మంచి గుర్తింపే తెచ్చిపెట్టాయి. ఇటీవలే 'మరకతమణి' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆది పినిశెట్టి హీరో ఈ సినిమాలో. కాగా తాజాగా 'ప్రేమలీల పెళ్లిగోల' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తమిళంలో తెరకెక్కింది. తెలుగులో అనువాదమవుతోంది. అయినా కానీ ఈ సినిమాని స్ట్రెయిట్ సినిమాలా పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రోమోస్ చిత్రంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా వరుస అవకాశాలతో చెల్లెలు నిక్కీ బిజీగా గడపడం చూసి అక్క సంజన మురిసిపోతోంది. ముందొచ్చిన అక్క కంటే చెల్లెలే బిజీగా ఉంది. కన్నడ, తమిళ, తెలుగు సినిమాలతోపాటు, మలయాళ, హిందీ సినిమాలపైనా నిక్కీ గల్రాని దృష్టిపెట్టింది. ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ తెలుగులో వస్తే, ఈ బ్యూటీ రాత్రికి రాత్రి స్టార్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందం, అభినయం ఇలా హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ నిక్కీ గల్రాని సొంతం కదా. ఏమో ఆ అవకాశం త్వరలోనే వచ్చినా రావచ్చు.