వెండితెరపై మాజీ క్రికెటర్ సత్తా ఎంత.?

మరిన్ని వార్తలు

క్రికెటర్‌గా శ్రీశాంత్‌ని చాలా మంది ఇష్టపడతారు. మైదానంలో ఆటతో పాటు మంచి వినోదం కూడా పంచేవాడు శ్రీశాంత్‌. యాక్టివ్‌గా ఉంటూ మ్యాచ్‌ చూసే వారికి మరింత యాక్టివ్‌నెస్‌ని కల్గించేవాడు. అలాంటి శ్రీశాంత్‌ చాలా కాలంగా క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేశాడు. ప్రస్తుతం సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశాడు. శ్రీశాంత్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. 'టీమ్‌ - 5' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదో డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ అట. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండనున్నాయంటున్నారు ఈ సినిమాలో. ముద్దుగుమ్మ సంజన చెల్లెలు నిక్కీ గల్రాని ఈ సినిమాలో శ్రీశాంత్‌కి జంటగా నటిస్తోంది. శ్రీశాంత్‌ మంచి డాన్సర్‌. మైదానంలోనే తన డాన్సులతో ఆకట్టుకునేవాడు. సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్‌తో నటనలోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట శ్రీశాంత్‌. శ్రీశాంత్‌ నటించిన సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళంలోనూ ఈ సినిమా విడుదల కానుంది. స్పోర్ట్స్‌లో తన సత్తా చాటిని శ్రీశాంత్‌, ఇకపై సినిమాల్లోనూ తన హవా చూపిస్తానంటున్నాడు. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తానంటున్నాడు. తొలి సినిమా 'టీమ్‌ - 5'తో ఎంట్రీ ఇస్తున్న శ్రీశాంత్‌కి హీరోగా గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేస్తూ, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS