న‌న్ను అడ‌క్కుండా... ఎలా చెబుతారు: నితిన్ ఫైర్‌

By Gowthami - March 22, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

హోలీ పండ‌గ సంద‌ర్భంగా నితిన్ కి సంబంధించిన రెండు కొత్త సినిమాల ఎనౌన్స్‌మెంట్లు వ‌చ్చాయి. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టిస్తార‌ని గురువారం ఉద‌య‌మే నిర్మాత ప్ర‌క‌టించారు. సాయింత్రం నితిన్ మ‌రో ట్వీట్ చేశాడు. తాను చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న‌ట్టు, ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంద‌ని ప్ర‌క‌టించాడు. ఆ ట్వీట్‌లో ఎక్క‌డా... ర‌మేష్ వ‌ర్మ సినిమాకి సంబంధించి ప్ర‌స్తావించ‌లేదు. 

 

ఉద‌యం ఓ ద‌ర్శ‌కుడి నుంచి ప్రెస్ నోట్ వ‌చ్చిన‌ప్పుడు క‌నీసం దాని గురించి మాట్లాడ‌కుండా, మ‌రో కొత్త సినిమా ఎనౌన్స్ చేయ‌డం ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో ఆశ్చర్యాన్ని, అనుమానాన్నీ క‌లిగించింది. ఇన్ సైడ్ సోర్సెస్ ద‌గ్గ‌ర కూపీ లాగితే అస‌లు విష‌యం తెలిసింది. అదేంటంటే... ర‌మేష్ వ‌ర్మ గ‌త కొంత‌కాలంగా నితిన్ తో ఓ సినిమా చేయ‌డానికి గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. నితిన్‌ని క‌లిసి ఓ క‌థ కూడా వినిపించాడ‌ట‌. నితిన్ మాత్రం 'చూద్దాం.. చేద్దాం' అని వాయిదా వేస్తున్నాడ‌ట‌. 

 

ర‌మేష్ వ‌ర్మ మాత్రం ఇదేదో తేల్చుకుందాం అన్న‌ట్టు.. నిర్మాత‌తో సినిమాని అధికారికంగా ప్ర‌కటించేశాడు. అయితే ఇదంతా నితిన్ అనుమ‌తి లేకుండా జ‌రిగిన వ్య‌వ‌హార‌మ‌ని, అందుకే నితిన్ వెంట‌నే స్పందించి... చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమాని ప్ర‌క‌టించాడ‌ని, ర‌మేష్ వ‌ర్మ సినిమా విష‌యంలో నితిన్ ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని స‌మాచారం. త‌న‌ని అడ‌క్కుండా ప్రెస్ నోట్ ఎలా పంపించార‌ని నితిన్ ఇప్పుడు ఫైర్ అవుతున్నాడ‌ట‌. పాపం.. ర‌మేష్ వ‌ర్మ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS