మహేష్‌ని రష్మిక: రష్మికను నితిన్‌.!

మరిన్ని వార్తలు

‘హి ఈజ్‌ సో క్యూట్‌.. హి ఈజ్‌ సో హాట్‌..’ అంటూ మొన్న మహేష్‌బాబుని రష్మిక పొగిడేస్తే, ఇప్పుడు ‘సో క్యూట్‌..’ అంటూ నితిన్‌, రష్మికను పొగిడేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమాలో మహేష్‌బాబుని రష్మిక పొగిడిన తీరుకు సరిరారు వేరెవ్వరూ అనుకున్నారంతా. అంత క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో మహేష్‌ని పొగిడిన రష్మిక, ఇప్పుడు అంతకు రెట్టింపుగా నితిన్‌తో పొగిడిరచేసుకుంది . ‘సో క్యూటే కాదు, ఏకంగా మిస్‌ వరల్డ్‌కే నువ్వు అప్‌డేట్‌ అని పొగిడేస్తున్నాడు రష్మికను నితిన్‌. రష్మిక ` నితిన్‌ జంటగా తెరకెక్కిన ‘భీష్మ’ నుండి లేటెస్ట్‌గా మరో సాంగ్‌ వీడియో రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ హీరోయిన్‌ని పొగిడేలా ఉన్నాయి. విజువల్‌లో విదేశీ లొకేషన్లు అదరగొడుతున్నాయి.

 

పొట్టి పొట్టి డ్రస్సుల్లో రష్మిక లుక్స్‌ నిజంగానే క్యూట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ ఓ ఎత్తు. ఈ పాట మరో ఎత్తు అనేలా ఉంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీష్మ’ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్‌ చేసిన ఈ సాంగ్‌ వీడియో, రిలీజ్‌ అయిన కొద్ది సేపట్లోనే వైరల్‌ అయిపోతోంది. ఓ వైపు సినిమాపై పోజిటివ్‌ వైబ్స్‌ ఈ రకంగా ఉంటే, మరో వైపు ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరు లవర్‌ బోయ్‌కి పెట్టారంటూ.. వెంటనే ఈ టైటిల్‌ మార్చాలనీ, లేకుంటే సినిమాని అడ్డుకుంటామనీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామనీ వారు డిమాండ్‌ చేస్తున్నారు. రిలీజ్‌ దగ్గర పడిన తరుణంలో తలెత్తిన ఈ వివాదాన్ని ‘భీష్మ’ టీమ్‌ ఎలా పరిష్కరిస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS