ఇష్క్ + గుండెజారి గ‌ల్లంత‌య్యిందే

By Gowthami - March 21, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

'శ్రీ‌నివాస క‌ల్యాణం' ఫ్లాప్ త‌ర‌వాత‌.. నితిన్ త‌న సినిమాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు. క‌థ‌ల్ని ఆచి తూచి ఎంచుకుంటున్నాడు. క‌థ ఓకే అయినా స‌రే - దాన్ని ప‌ట్టాలెక్కించే విష‌యంలో ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌డం లేదు. ఇప్పుడు మాత్రం వ‌రుస‌గా క‌థ‌ల్ని ఒప్పుకుంటున్నాడు. 

 

వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` త్వర‌లో ప్రారంభం కానుంది. ఈలోగా 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా క‌థ‌ని ఓకే చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈలోగా ర‌మేష్ వ‌ర్మ క‌థ‌కీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు నితిన్‌. `వీర‌` త‌ర‌వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కుల రేసులో బాగా వెనుక‌బ‌డ్డాడు. 

 

ఇటీవ‌ల బెల్లంకొండ తో 'రాక్ష‌స‌న్‌' సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ఆ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండ‌గానే నితిన్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు. ఇదో ల‌వ్ స్టోరీ. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే త‌ర‌హాలో పూర్తి వినోదాత్మ‌కంగా సాగుతుంద‌ట‌. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌. ఆగ‌స్టు నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS