ప్లాప్ ల పరంపర నుండి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?

By Inkmantra - November 27, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

'ఇష్క్' సినిమాకు ముందు వరకూ ఫిల్మ్ సర్కిల్స్ లో హీరో నితిన్ పరిస్ధితి ప్లాప్ అనే పదానికి పర్యాయపదం అనే స్థితిలో వుండేది. ఎట్టకేలకూ నితిన్ 'ఇష్క్' తరువాత 'గుండెజారి గల్లంతయ్యిందే' 'అ ఆ' చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని మళ్ళీ ఘనంగా హిట్ ట్రాక్ ఎక్కాడు. కానీ గత మూడు చిత్రాలు 'లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం' ఇలా వరుస ప్లాప్ లతో మళ్లీ ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ ను దగ్గరుండి రెడీ చేయించుకోని మరీ 'భీష్మ' సినిమాని తీసుకు రాబోతున్నాడు.

 

'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కామెడీ చాల బాగా వస్తోందని.. మెయిన్ గా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. వెంకీ కుడుముల 'ఛలో' మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందట. హెబ్బా గ్లామర్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోందని చెబుతుంది చిత్రబృందం.

 

ఇక నితిన్ భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి కనీసం ఈ సినిమానైనా నితిన్ ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందేమో చూడాలి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన మెయిన్ హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్, 'భీష్మ'తో పాటు వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న 'రంగ్ దే' సినిమాలోనూ అలాగే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఏమైనా నితిన్ ప్లాన్డ్ గా వెళ్తున్నాడు మరి ఆ ప్లాన్ సక్సెస్ తీసుకొస్తోందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS