తెలుగులో తక్కువ సినిమాలతోనే చెప్పుకోదగ్గ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా పేతురాజ్ పేరు ఖచ్చితంగా వుంటుంది. అయితే, మెయిన్ హీరోయిన్ అనే గుర్తింపు దక్కడానికి మాత్రం ఈ బ్యూటీ ఇంకా కష్టపడాల్సి వుంది. ఆ కష్టానికి లక్ కూడా కలిసి రావాల్సి వుందనుకోండి. అది వేరే సంగతి. అసలు విషయానికొస్తే, ఈ బ్యూటీ కాస్త ఆలస్యంగా ట్విట్టర్ కుటుంబంలోకి అడుగు పెట్టింది. కాదు కాదు, ఆమెను బలవంతంగా ట్విట్టర్ లోకి కొందరు లాగారని అనుకోవచ్చు. ఎందుకంటే, ఈ బ్యూటీ పేరుతో పలు ఫేక్ అక్కౌంట్లు ప్రచారంలో వున్నాయి. వాటిల్లో ఈ మద్య జుగుప్సాకరమైన రీతిలో ఈ బ్యూటీ పొటోలతోపాటు, ఇతర హీరోయిన్ల ఫొటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓ అక్కౌంట్ అయితే, అచ్చంగా ఆమెదేనన్నట్లుగా (నిదేదా అఫీషియల్) అని పెట్టేశారు.
ఈ వ్యవహారం గురించి కాస్త ఆలస్యంగా తెలుసుకున్న నివేదా తీవ్ర ఆవేదనకు గురయ్యిందట. వెంటనే, సదరు అక్కౌంట్లను బ్లాక్ చేయాలంటూ ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదు చేసింది నివేదా పేతురాజ్. అంతే కాదు, తన పేరిట అక్కౌంట్ ఇటీవల ప్రారంభించానని, దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలనీ పేర్కొంది. త్వరలోనే నివేదా పేతురాజ్ అపీషీయల్ ట్విట్టర్ అక్కౌంట్ బ్లూ టిక్ (వెరిఫైడ్ అకౌంట్) సంతరించుకోబోతోందట. ఈ బ్యూటీ తన తాజా చిత్రం రెడ్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. రామ్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. రామ్ సరసన నివేదాతోపాటు మాళవిక శర్మ మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ‘రెడ్‘ సంగతి పక్కన పెడితే, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలోనూ నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది.