విజయ్ దేవరకొండ ఓ స్టార్. తన సినిమా వస్తోందంటే హాట్ కేకుల్లా కొనేయడానికి బయ్యర్లు రెడీగా ఉంటారు. అయితే... ఈసారి విజయ్ కి చుక్కెదురు అవుతోంది. తన కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకి బయ్యర్లు కరువయ్యారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
కె.ఎస్,రామారావు నిర్మాత. ఇందులో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. అయినా ఏమంత క్రేజ్ లేదు. కారణం... విజయ్ గత చిత్రం 'డియర్ కామ్రేడ్' డంకీ కొట్టడమే. దానికి తోడు టైటిల్‌కి నెగిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. పైగా క్రాంతి మాధవ్‌పై ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవు.
విజయ్ దేవరకొండ సినిమా అంటే.. సగం సినిమా అవ్వకమునుపే ఓవర్సీస్ హక్కులు అమ్ముడైపోతాయి. అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్'కి ఇంకా ఓవర్సీస్ బిజినెస్ మొదలవ్వలేదు. రూ.4 కోట్లకు అమ్ముతానన్నా కొనేవాళ్లెవరూ లేరట. 'డియర్ కామ్రేడ్'ని అక్కడ దాదాపు 5 కోట్లకు కొన్నారు. దానికంటే రేటు తక్కువ చెబుతున్నా... ఎవరూ కదలడం లేదట. 'డియర్ కామ్రేడ్' వల్ల ఓవర్సీస్ బయ్యర్లు బాగా నష్టపోయారు. అందుకే విజయ్ సినిమా అంటే ఆసక్తి చూపించడం లేదని టాక్.