బాలయ్య సరసన ముగ్గురు భామలు.!

మరిన్ని వార్తలు

బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కోసం ముగ్గురు ముద్దుగుమ్మల్ని ఎంపిక చేసుకోనున్నాడట బోయపాటి. అందులో ఒక హీరోయిన్‌గా హాట్‌ బ్యూటీ కేథరీన్‌ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాడట. బోయపాటి డైరెక్షన్‌లో కేథరీన్‌ నటించిన 'సరైనోడు' సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.

 

అదే సెంటిమెంట్‌ని 'జయ జానకి నాయకా'లోనూ ఫాలో చేశాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది కేథరీన్‌. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. అలా ఆ సెంటిమెంట్‌ని 'వివిఆర్‌' లోనూ కంటిన్యూ చేస్తాడనుకున్నారు కానీ, కుదరలేదు. 'వివిఆర్‌' కోసం బాలీవుడ్‌ హాట్‌ ఐటెం ఈషా గుప్తాని పట్టుకొచ్చాడు. ఇక ఈ సారి బాలయ్య తాజా సినిమాలో ఓ క్యారెక్టర్‌ కోసం ఖచ్చితంగా కేథరీన్‌ని ఎంచుకునే ఆలోచనలో ఉన్నాడట బోయపాటి.

 

అలాగే ఇంకో హీరోయిన్‌గా ఒక సీనియర్‌ హీరోయిన్‌ని ఎంచుకుంటారట. మూడో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామను దిగుమతి చేయనున్నాడట. ప్రస్తుతం బోయపాటి శీను 'వినయ విధేయ రామ' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు బాలయ్య 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతి సీజన్‌లో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎన్టీఆర్‌ రెండో పార్ట్‌ 'మహానాయకుడు' ఫిబ్రవరిలో విడుదల కానుంది.

 

బాలయ్య, బోయపాటి ఆయా సినిమాల నుండి ఫ్రీ అయ్యాక ఈ తాజా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారట. గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 'సింహా', లెజెండ్‌' మూవీస్‌ సంచలన విజయాలు అందుకున్నాయి. అదే మ్యాజిక్‌ మూడో సినిమాకీ రిపీట్‌ చేస్తారేమో చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS