'హీరో' కోసం.. ఇద్ద‌రు హీరోల గొడ‌వ‌

By Gowthami - March 14, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

మొన్నామ‌ధ్య నానికి టైటిల్ క‌ష్టాలొచ్చాయి. 'గ్యాంగ్ లీడర్‌' టైటిల్ మాదే అని.. నాని సినిమాకి ఎలా పెడ‌తార‌ని ఓ చిన్న సినిమా నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అలాంటి క‌ష్ట‌మే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కీ వ‌చ్చేసింది. విజ‌య్ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రానికి 'హీరో' అనే టైటిల్ పెట్టారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఇదే పేరు.

 

అయితే.. త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా 'హీరో' అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ పేరుని ఆయ‌నెప్పుడో రిజిస్ట‌ర్ చేయించుకున్నాడు. అలాంట‌ప్పుడు త‌మిళంలో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా పేరు మార్చుకోక త‌ప్ప‌దు. `హీరో`కి ముందు 'విజ‌య్ దేవ‌ర‌కొండ‌' అని చేర్చుకుంటే ఎలాంటి గొడ‌వ ఉండ‌దు. కాక‌పోతే... 'విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో` అనే పేరు ప‌ల‌క‌డానికే ఇబ్బందిగా ఉంటుంది. 'హీరో' అనేంత సింపుల్ గా, క్యాచీగా ఉండ‌క‌పోవొచ్చు. ఈ ఇబ్బందిని విజ‌య్ ఎలా దాటుకొస్తాడో??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS