బాలకృష్ణ 'ఎన్టీఆర్‌'లో రాజకీయాలు లేవా?

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్‌' పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న సినిమాను గ్రాండ్‌గా లాంచ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మార్చి 29న ఈ చిత్రం ఓపెనింగ్‌ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించనున్నారట. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్‌ ఇండూరితో కలిసి బాలయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కి యూనివర్సల్‌గా ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకే ఈ సినిమాని తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర తెరచిన పుస్తకం. ఆయన జీవితంలో ఎన్నో మలుపులు. అవార్డులు, రివార్డులు. ఆయన జీవితంలోని కొన్ని ఘట్టాలు ఎందరికో ఆదర్శం. అలాంటి లెజెండరీ వ్యక్తి జీవిత గాధను ఆయన కుమారుడు బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కడం అనేది నిజంగా విశేషమైన అంశమే. సినీ, రాజకీయ ప్రస్థానాలు ఆయన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలు. అందుకే ఆ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను తెరపై ఆవిష్కరించనున్నారు ఈ సినిమా ద్వారా. 

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలియనున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే ప్రెస్టీజియస్‌ మూవీ ఈ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS