ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు భాగాలుగా తీస్తున్నారన్నప్పుడు - `గుడ్ ఐడియా` అనుకున్నారంతా. ఎందుకంటే రెండుసార్లు సినిమాని అమ్ముకోవొచ్చు కదా? ఒకటికి రెండింతలు భాగం వస్తుంది కాబట్టి - ట్రేడ్ పరంగా అది మంచి ఆలోచనే. కాకపోతే.. పార్ట్ 1 ఫ్లాప్ అవ్వడంతో అంతా మాట మార్చేశారు. 'ఒక భాగంగా తీసుంటే గ్రిప్పింగ్‌గాఉండేది. రెండో భాగం కోసం సన్నివేశాల్ని సాగదీశారు' అంటూ విమర్శించారు.
నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కాదు.. మూడు భాగాలుగా రావాల్సింది. అవును.. ఎన్టీఆర్ బయోపిక్ మూడో భాగం కూడా తీద్దామనుకున్నారు. ఎన్టీఆర్ కథ బసవతారకం కోణంలో సాగుతుంది. బసవతారకం మరణంతో ఈ కథ పూర్తవుతుంది. అయితే బసవతారకం తరవాత కూడా ఎన్టీఆర్ జీవితం సాగింది.
ఓ విధంగా... ఎన్టీఆర్ తన జీవితంలోని క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కున్న ఘట్టం అది. ఆ సన్నివేశాలన్నీ పార్ట్ 3లో చూపిద్దామనుకున్నారు. అయితే.. `కథానాయకుడు` ఎప్పుడైతే ఫ్లాప్ అయ్యిందో, అప్పుడు ఈ ఆలోచన విరమించుకున్నారు. పార్ట్ 3 కోసం అట్టిపెట్టిన సన్నివేశాలన్నీ పార్ట్ 2లోనే చూపించాలని ఫిక్సయ్యారు. లేదంటే మూడో భాగం కూడా వచ్చేసేదే.