'అయ్యారే' రామ్‌తో సినిమా సెట్‌ అయ్యేనే.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో శివాజీ, సీనియర్‌ హీరో రాజేంద్రప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'అయ్యారే' మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన సాగర్‌.కె.చంద్ర తర్వాత 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. నారా రోహిత్‌, శ్రీవిష్ణుకీ నటులుగా ఈ సినిమాతో మంచి పేరు దక్కింది. తాజాగా సాగర్‌ యంగ్‌ హీరో కోసం ఓ స్టోరీ లైన్‌ ప్రిపేర్‌ చేశాడట. అది రామ్‌కి చాలా బాగా నచ్చిందట. 

 

స్టోరీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని డెవలప్‌ చేయమని రామ్‌, సాగర్‌కి సూచించాడట. త్వరలోనే ఆ స్టోరీలో రామ్‌ నటించబోతున్నాడనీ తెలుస్తోంది. ఈ సినిమాని రామ్‌ తన ఫ్యామిలీ బ్యానర్‌ స్రవంతి క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందించనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈలోగా రామ్‌ సెట్స్‌పై ఉన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని పూర్తి చేసేస్తాడు. 

 

పూరీతో సినిమా అంటే ఎలాగూ టైంకే కంప్లీట్‌ అయిపోతుంది. సో ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే రామ్‌ ఇంకో సినిమాని లైన్‌లో పెట్టేశాడంటే మాంచి జోరు మీదున్నట్లే. ఇస్మార్ట్‌ శంకర్‌లో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS