ఈయేడాది టాలీవుడ్ 'ఎన్టీఆర్ కథానాయకుడు'తో కొబ్బరి కాయ కొట్టుకుంది. పాజిటీవ్ రివ్యూలు వచ్చినా సరే - ఈ సినిమా డిజాస్టర్ జాబితాలో చేరిపోవడం చిత్రబృందాన్ని కలచి వేస్తోంది. అన్ని చోట్లా ఈ సినిమాకి భారీ నష్టాలే వచ్చాయి ఇప్పుడు ఓవర్సీస్ లెక్కలు బయటకు వచ్చాయి సంక్రాంతి మూడ్, క్రిష్‌సినిమా, ఎన్టీఆర్ కథ, బాలయ్య సెంటిమెంట్ ఇవన్నీ కలసి... కథానాయకుడు సినిమాని భారీ రేటుకి కొనుగోలు చేసేలా ప్రేరేపించాయి.
దాదాపుగా రూ.9 కోట్లకు ఓవర్సీస్ హక్కులు అమ్మడయ్యాయి. తీరా చూస్తే... ఓవర్సీస్‌లో ఇప్పటి వరకూ ఈ చిత్రానికి 3.9 కోట్లే వచ్చాయి. అంటే దాదాపు రూ.5 కోట్ల నష్టాలు భరించాల్సివచ్చిందన్నమాట. బాలయ్య వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ఓవర్సీస్ లో రూ.5 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ సినిమా హిట్ కాబట్టి, ఆ సొమ్ముని రికవరీ చేసుకోగలిగింది. కానీ... ఎన్టీఆర్ - కథానాయకుడు మాత్రం సగం కూడా రికవరీ చేసుకోలేక చతికిలపడింది.