ఎన్టీఆర్‌ ఈ సారి ఏం థ్రిల్‌ ఇస్తాడో!

మరిన్ని వార్తలు

డిఫరెంట్‌ గెటప్స్‌ ట్రై చేయడంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడిప్పుడు. ఆ విషయానికొస్తే, మన హీరోలంతా కూడా డిఫరెంట్‌ స్టైల్‌లో డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించాలనే అనుకుంటున్నారు. సినిమా సినిమాకీ వేరియేషన్‌ చూపిస్తున్నారు. నటన సంగతి పక్కన పెడితే, గెటప్‌ విషయంలో ఏ హీరో వెనుకాడడం లేదు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్‌ గెటప్‌ చాలా చాలా కొత్తగా ఉంటుంది. 

మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా, తర్వాత ఆ గెటప్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్‌ని చాలా ఎట్రాక్ట్‌ చేసిందా గెటప్‌. ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ న్యూ గెటప్‌ ట్రై చేస్తున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హాలీవుడ్‌ మేకప్‌ స్టైలిష్ట్‌ని ఈ గెటప్‌ కోసం ఎన్టీఆర్‌ తీసుకొచ్చాడంటూ టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం యంగ్‌ హీరోస్‌ గుబురు గెడ్డంతో ట్రెండ్‌ సృష్టించారు. 

కానీ ఎన్టీఆర్‌ మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ ట్రై చేయని ట్రెండీ లుక్‌లోకి మారిపోనున్నాడట. 'జై లవకుశ' సినిమా కోసం మూడు గెటప్స్‌లో కనిపించాడు ఎన్టీఆర్‌. అయితే ఆ మూడు గెటప్స్‌ అంతకు ముందు పరిచయం ఉన్నవే. కానీ తాజా సినిమా కోసం సరికొత్త లుక్‌ని ట్రై చేస్తున్నాడట. అంతేకాదు అందుకోసం ఎన్టీఆర్‌ కొంచెం బరువు కూడా తగ్గనున్నాడట. 'అజ్ఞాతవాసి' సినిమాతో త్రివిక్రమ్‌ లేటెస్టుగా దెబ్బ తిన్నాడు. అందుకే ఎన్టీఆర్‌ సినిమాపై ఫోకస్‌ కొంచెం ఎక్కువగా పెట్టాడట. కథ, కథనాలపై ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నాడట. 

అలాగే ఈ సినిమాలో మొదట అనూ ఇమ్యాన్యుయేల్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ బాలీవుడ్‌ బ్యూటీని దించే ఆలోచనలో ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుందనీ చిత్ర యూనిట్‌ పేర్కొంది.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS