'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ శనివారం విడుదలైంది. ఈ ట్రైలర్‌లోనూ ఆశించిన మెరుపులేం కనిపించలేదు. పైగా... నారా చంద్రబాబు నాయుడు పాత్రని పూర్తిగా సైడ్ చేసి, నాదెండ్ల భాస్కర్‌ని విలన్‌గా చూపించే ప్రయత్నాలు ముమ్మరంగా కనిపించాయి. దానికి తోడు ఓ డైలాగ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
'మొదటి సినిమా ఆడలేదంట.. ఆ తరవాత సినిమాకు తిరుగే లేదంట' అనే వెన్నెల కిషోర్ డైలాగ్ ప్రస్తుతం బాగా ట్రోల్ అవుతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లోని తొలిభాగం `కథానాయకుడు` డిజాస్టర్ అయ్యింది. దాన్ని ఉద్దేశించే 'తొలి సినిమా ఆడకపోతేనేం.. రెండో సినిమాతో హిట్టు కొడతాం' అనే సంకేతాలు పంపాడు క్రిష్. నిజానికి ఆ డైలాగ్ ఉద్దేశం వేరు.
రాజకీయాల్లో ఎన్టీఆర్ విఫలమైనప్పుడు సినిమాలతో - రాజకీయాలతో పోల్చి.. 'రెండోసారి కలిసొస్తుందిలే' అనే సెంటిమెంట్ ని పలికించిన డైలాగ్ ఇది. కానీ... తీరా చూస్తే 'మా తొలి సినిమా ఫ్లాప్ అయ్యింది' అనే అర్థం వచ్చేసింది. తొలి సినిమా ఫ్లాప్ అయ్యిందని చెప్పుకోవడం మాట అటుంచితే - రెండో భాగానికి తిరుగే ఉండదని అని ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పరాకాష్టగా ఆ డైలాగ్ నిలిచింది. అసలే ఓ డిజాస్టర్ తగిలింది. ఇలాంటప్పుడు ఈ డైలాగులు అవసరమా? అనేది అభిమానుల మాట.