'పెళ్లి చూపులు' సినిమాతో హీరో విజయ్‌దేవరకొండకు ఎంతగా క్రేజ్ వచ్చిందో ఇంచుమించు అంతే క్రేజ్‌ని కమెడియన్ ప్రియదర్శి కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్‌గా బెస్ట్ సపోర్టింగ్ రోల్లో ఆకట్టుకున్న ప్రియదర్శి త్వరలో హీరోగానూ సత్తా చాటనున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత పోచంపల్లి చేనేత కార్మికుడు 'చింతకింది మల్లేశం' బయోపిక్‌లో ప్రియదర్శి టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే కంబైన్డ్ హీరోగా 'మిఠాయి' తదితర చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ఇక్కడితో ఆగడం లేదు మనోడు. త్వరలోనే మెగాఫోన్ పడతానంటున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని ఓ సందర్భంలో ప్రియదర్శి స్పష్టం చేశాడు. తాజాగా 'మిఠాయి' ఆడియో ఫంక్షన్లో 'పెళ్లిచూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి ఇదే విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ సారి ప్రియదర్శి ఏమీ మాట్లాడలేదు ఈ అంశంపై. అయితే దర్శకుడిగా, కమెడియన్‌గా, హీరోగా రాణించడం అంటే అంత ఆషామాషీ కాదు.
సో అది తనకు సెట్ అవ్వదులే అనుకుని విరమించుకున్నాడో ఏమో కానీ ప్రియదర్శి అయితే ప్రస్తుతం డైరెక్షన్ కోసం ఎక్కడా మాట్లాడడంలేదు. ఏదిఏమైనా ఇప్పుడొస్తున్న హీరోలు, ఆర్టిస్టులు ఒకే టాలెంట్‌ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం లేదు. రకరకాల టాలెంట్స్‌తో వస్తున్నారు. అలాగే రాణిస్తున్నారు కూడా. యంగ్ హీరో అడవిశేష్ కూడా సకలకళా వల్లభుడేనన్న సంగతి తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డైరెక్టర్‌గా స్క్రిప్టు రైటర్‌గా పలు అంశాల్లో తన టాలెంట్ ప్రదర్శిస్తున్నాడు. అలాగే ప్రియదర్శి కూడా సత్తా చాటుతాడేమో చూడాలి మరి.