'మ‌హానాయ‌కుడు'... ఫిక్స‌య్యాడు

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోని రెండోభాగం 'మ‌హానాయ‌కుడు' రిలీజ్ డేట్ ఎప్పుడా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు నంద‌మూరి అభిమానులు. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో రావాల్సిన ఈ చిత్రాన్ని రెండో వారానికి వాయిదా వేశారు. కానీ రెండో వారం కూడా రాలేదు. ఈ సినిమా మార్చి 1కి వాయిదా ప‌డింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

 

అయితే.. ఇప్పుడు చిత్ర‌బృందం రిలీజ్ డేట్ విష‌యంలో ఓ స్ప‌ష్ట‌త ఇచ్చేసింది. 'మ‌హానాయ‌కుడు' ఫిబ్ర‌వ‌రి 22నే వ‌చ్చేస్తోంది. శ‌నివారం నాటితో... `మ‌హానాయ‌కుడు` షూటింగ్ మొత్తం పూర్త‌యింది. మ‌రోవైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా తుది ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లో మ‌హానాయ‌కుడు నుంచి కొత్త ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది కూడా. 'ఎన్టీఆర్ - క‌థానాయ‌కుడు' నంద‌మూరి బాలకృష్ణ​ని​ అన్ని విధాలా నిరాశ ప‌రిచింది. మ‌రి 'మ‌హానాయ‌కుడు' ఏం చేస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS