'మణికర్ణిక' సినిమా ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలుసు. సినిమా బాగుంది, బాగోలేదు అని మాట్లాడుకున్న వారి కంటే సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాల గురించే ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. కంగనారనౌత్ ముందే అంతా ప్లాన్ చేసుకుని దర్శకుడు క్రిష్‌ని టార్గెట్ చేసింది. క్రిష్ పేరును మార్చి పేర్కొనడం వెనక పెద్ద కథే నడిచిందట.
నిజానికి సినిమా చాలా బాగుంది అన్నవారెవరూ లేరు. కంగనా మంచి ప్రయత్నం చేసింది అని మాత్రమే కొందరన్నారు. క్రిష్‌ని తప్పించడం, సినిమాలో చాలా మార్పులు చేయడం ఇలా కంగనా ప్రదర్శించిన పైత్యంతో నిర్మాతకు తడిసి మోపెడైంది. ఈ పరిస్థితుల్లో నిర్మాత కాస్త తగ్గి కంగనా చెప్పినట్లే వినాల్సి వచ్చింది. సినిమా విడుదలయ్యాక, క్రిష్‌కి వ్యతిరేకంగా నిర్మాత మాట్లాడడం వెనక కంగనా హస్తమే ఉంది.
ఎంత గింజుకున్నా వసూళ్ల పరంగా 'మణికర్ణిక' అంచనాల్ని అందుకోలేక చతికిలబడింది. రీషూట్లు కలుపుకుంటే, భారీ మొత్తం ఖర్చు కాగా, అందులో సగం కూడా రికవరీ కాలేదనీ సమాచారమ్. దాంతో కంగనా తాజాగా తన రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని తిరిగిచ్చేయాల్సి వచ్చిందట. అయినా నిర్మాత తేరుకోలేదని, విషయం తెలుసుకున్న క్రిష్ త్వరలోనే అన్ని వివరాలతో కంగనాపై ఎటాక్‌కి సిద్ధమవుతున్నాడనీ సమాచారమ్.