ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా విడుదల ఇప్పుడు అంత మంచిది కాదని బాలయ్యకు అత్యంత సన్నిహితులు సూచిస్తున్నారని తెలుస్తోంది . మంచి టాక్ వచ్చినా 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఆడలేదు. డబ్బులు అనేది తర్వాతి విషయం. అయితే ఎన్టీఆర్ ఇమేజ్ చెడిపోయినట్లైంది ఈ సినిమాతో. ఈ తరుణంలో 'మహానాయకుడు' విడుదల చేయాలనుకోవడం అస్సలేమాత్రం మంచిది కాదు.
రాబోయే ఎలక్షన్స్‌లో ఈ ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది. సినిమాని ఆపేయడమే మంచిది అని చెబుతున్నారట. ఎవరైతే బాలయ్యకు ఈ సూచనలు చేశారో వారు 'మహానాయకుడు' కంటెన్ట్ పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేయట్లేదని సమాచారమ్. అయితే తీసేసిన సినిమాని విడుదల చేయకుండా ఉండడం సబబు కాదు, రీషూట్స్ చేయడానికి టైం లేదు. ఇంకో ఆప్షన్ లేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బాలయ్య ఉన్నాడు. సరైన ప్లానింగ్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
ఈ తరుణంలో 'మహానాయకుడు' 14న రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 21 కూడా కష్టమేనంటున్నారు. అసలు రిలీజవుతుందా.? లేదా.? అనే చర్చ జోరుగా సాగుతోంది. సినిమా పూర్తిగా ట్రాష్ చేశారు. ఇక మొత్తం సినిమాని రీషూట్ చేయబోతున్నారట అనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. అదే కనుక నిజమైతే ఇప్పట్లో ఎన్టీఆర్ 'మహానాయకుడు' రాకపోవచ్చు అనేది తాజాగా వినిపిస్తున్న మాట. అయితే బాలకృష్ణ ఏ క్షణాన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టమే.