నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ముహూర్తాల ప్రకారమే చేస్తుంటారు. ఆడియో రిలీజ్‌లు, బెనిఫిట్ షోలూ.. ఆఖరికి ఫస్ట్ లుక్, టీజర్ అయినా సరే - ఆయన చెప్పిన ముహూర్తానికే విడుదల చేయాలి. `మహానాయకుడు` ట్రైలర్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 22న `ఎన్టీఆర్ మహానాయకుడు` సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకూ ప్రచార హంగామా ఎక్కడా కనిపించలేదు.
ఇప్పుడు ట్రైలర్ రూపంలో... ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శనివారం సాయింత్రం 5 గంటల 55 నిమిషాలకు ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ట్రైలర్ కోసం ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని ముందుగా అనుకున్నా.. అది వీలు కాలేదు. అన్నట్టు.. శనివారమే `మహానాయకుడు` సెన్సార్ కూడా పూర్తికానున్నదని సమాచారం. విద్యాబాలన్, రానా, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు.