తమిళ నటుడు అరవింద్ స్వామి, అక్షరాలా మన తెలుగోడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మరో లీడ్ రోల్లో ముద్దుగుమ్మ శ్రియ నటిస్తోంది. తమిళంలో 'నరకాసురన్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాని 'నరకాసురుడు' టైటిల్‌తో ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలుగులోకి తీసుకొస్తున్నారు. లేటెస్ట్గా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ సీరియస్‌గా చూస్తున్నారు.
వీరి ముగ్గురి కిందా మరో ముద్దుగుమ్మ ఆత్మిక హాయిగా స్మైల్ ఇస్తూ కనిపిస్తోంది. చుట్టూ చీకటి, ఆ చీకట్లో ఓ కారు.. 'ది టేల్ ఆఫ్ ఎ ఫాలెన్ డెమాన్' అని ఈ పోస్టర్‌పై రాసుంది. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ని. దీన్ని బట్టి చూస్తుంటే ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా అనిపిస్తోంది. టైటిల్‌ని బట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ అనీ తెలుస్తోంది. అయితే అరవింద్‌స్వామి, సందీప్‌కిషన్, శ్రియ ముగ్గురికీ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుందట సినిమాలో. ఒకప్పుడు లవర్‌బోయ్ ఇమేజ్ ఉన్న అరవింద్‌స్వామి 'ధృవ' సినిమాతో స్టైలిష్ విలన్‌గా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు.
మరి ఈ సినిమాలో ఎలాంటి రోల్ పోషించబోతున్నాడో అని ఫస్ట్‌లుక్ చూశాక ఆడియన్స్‌లో ఆశక్తి నెలకొంది. ఇక యంగ్‌హీరో సందీప్ కిషన్ చేతిలో ఇప్పటికే హీరోగా రెండు సినిమాలున్నాయి. టాలెంట్ ఉన్నా, హీరోగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు మనోడు. గ్లామర్ తారగా కుర్రాళ్ల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రియ పెళ్లి తర్వాత పర్ఫామెన్స్కి స్కోపున్న క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటోంది. చూడాలిక 'నరకాసురుడు' ఈ ముగ్గురికీ ఎలాంటి ఈక్వల్ రిజల్ట్ ఇవ్వనుందో. సమ్మర్లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.