ఈ నెల 22న 'ఎన్టీఆర్ - మహానాయకుడు' రిలీజ్ డేట్ ప్రకటించేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక 'మహానాయకుడు' డిస్ట్రిబ్యూటర్స్‌కి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇది కూడా 'కథానాయకుడు'లాగే హిట్ కాకుంటే ఏంటి పరిస్థితి.? ఆ సినిమాతో వచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. పోయింది రాబట్టుకోవడం అంటే ఆషామాషీ కాదు. అయినా బాలయ్య సినిమాతో లాభాలు రాబట్టాలంటే ఇప్పటికప్పుడు 'లెజెండ్'లాంటి సినిమా పడాలి.
కానీ అదిప్పట్లో సాధ్యమయ్యేది కాదు. దాంతో 'మహానాయకుడు' పెద్ద తలనొప్పిగా మారింది డిస్ట్రిబ్యూటర్స్‌కి. ఇదిలా ఉంటే, పుండు మీద కారం చల్లినట్లు, ఈ లోగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ వచ్చింది. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎంత గొప్పగా మన్నన పొందాడు. ఏం సాధించాడు అన్నదాని కన్నా, ఆయన చివరి కాలంలో వెన్నుపోటు ఎపిసోడ్ మీదే అందరికీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది.
అదే మెయిన్ పాయింట్‌గా తీసుకున్నాడు తన సినిమాలో వర్మ. 'మహానాయకుడు' లో అదెలాగూ లేదని తెలిసిపోయింది. దాంతో ఈ సినిమా కూడా 'కథానాయకుడు'లానే చప్పగా తేలిపోతుందనే అనుమానం బలంగా ఉంది. కానీ బాలకృష్ణను గట్టిగా ఎదిరించలేక, పైకి మాట్లాడలేక లోలోపల డిస్ట్రిబ్యూటర్లు కుమిలిపోతున్నారట.