ఎన్టీఆర్ ట్రైల‌ర్.. ఆడియో లాంఛ్.. డిటైల్స్

By iQlikMovies - December 16, 2018 - 15:15 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది.

న‌టీన‌టులు:

నందమూరి బాల‌కృష్ణ, విద్యాబాల‌న్, రానా ద‌గ్గుపాటి, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ, నిత్యామీన‌న్..

- ప్రెస్ రిలీజ్ 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS